బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలిమ్స్ దక్షిణాదిలో తమిళం, తెలుగులో ఒకేసారి సినిమా రూపొందిస్తున్నప్పుడు సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగినట్టుగానే హిందీలో సూపర్‌హిట్టయిన బ్యాండ్‌బాజా బరాత్ రీమేక్ సబ్జెక్ట్‌ను ఎన్నుకున్నారు. మంచి క్యాస్టింగ్‌ను సెలక్ట్ చేసుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి.
ఇది రీమేక్ సినిమా కాబట్టి అల్రెడి ఒరిజినల్ వెర్షన్ బ్యాండ్ బాజా బరాత్‌ను చాలా మంది చూసుంటారు. అదీ గాక ఇదే థీమ్‌తో ఇంతకు ముందు జబర్‌దస్త్ రావడం కారణంగా ప్రతి విషయాన్ని బ్యాండ్‌బాజా బరాత్‌తో ప్రేక్షకుడు పోల్చుకుంటాడు. తమిళం నుండి డబ్ చేసే సన్నివేశాలు కొద్డిగా విసుగనిపిస్తాయి. కామెడీ అంశాలు మరింత చొప్పించాల్సింది. ఇటువంటి సినిమాలకి సంగీతమే ప్రాణం కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది.నాని క్యారెక్టర్లో ఇమిడిపోయాడు. ప్రతి సినిమాలోలాగానే ఈ సినిమాకి పూర్తిగి కొత్త లుక్ తీసుకొచ్చాడు. కామెడీ పండించడంలో అతను వేసే డైలాగ్స్, నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తన పాత్రను చేయడంలో సక్సెస్ ఫుల్‌గా చేశాడు. వాణీకపూర్ కూడా భాష రాకపోయినా హవభావాలను చక్కగా పలికించింది. చక్కగా నటించింది. సిమ్రాన్ అతిథి పాత్రలో మెరిసింది , తన పాత్రకు న్యాయం చేసింది. ఇక మిగతా పాత్రల నిడివి అంతగా లేదనే చెప్పాలిసినిమా కూల్‌గా ఉంటూ, ఎక్కడా హైరానా లేకుండా మనమేదో పెళ్లికి వెళ్లామనే ఫీలింగ్ కలుగుతుంది. ఇదొక కమనీయ కల్యాణం...
A visual treat, 'Aaha Kalyanam' is a rom-com for the mature audience giving a good feel of attending a wedding...so sit back and have fun :)
No comments:
Post a Comment